మెగాస్టార్ చిరంజీవి నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రికార్డులు ఎన్నింటినో సృష్టించారు.ఇప్పుడు అలాంటిదే మరో రికార్డు సృష్టించారు. కాలానికి ఎవరూ అతీతులు కాదు. జనరేషన్ లు మారిపోతుంటే వ్యక్తుల ప్రాధాన్యతలు ప్రాబల్యాలు మారిపోతుంటాయి.కానీ కాలం మారినా మారనిది మెగాస్టార్ క్రేజ్ అని ఆయన నిరూపిస్తున్నారు.రెండవ జనరేషన్ కి నెంబర్ వన్ స్టార్ NTR అయితే మూడవ జనరేషన్ కి నెంబర్ వన్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. Next జనరేషన్ స్టార్ హీరోలు Establish అయిపోయిన తర్వాత సాధారణంగా ముందరి జనరేషన్ స్టార్ హీరోలు వెటరన్ లు గా మారిపోతారు. ఏ ఇండస్ట్రీలో అయినా జరిగేది ఇదే. మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హీరోగా మారిన తర్వాత, అంతకు ముందు నెంబర్ వన్ హీరో అయిన NTR కొన్ని చిత్రాలు చేసారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక,మేజర్ చంద్రకాంత్, శ్రీనాధ కవిసార్వభౌముడు. వీటిలో ఒక్క మేజర్ చంద్రకాంత్ సినిమా తప్ప మిగిలిన వన్ని ఫ్లాప్ లు. చెప్పుకోతగ్గ కలెక్షెన్స్ కూడా రాబట్టలేక పొయాయి.జనరేషన్ మారిపోవటం వల్ల జరిగే పరిణామాలివి, అంతే తప్ప ఆ సినిమాలు ఆడకపోవటం వల్ల NTR ఘనత ఇసుమంత తగ్గదు,అలాగే ఆలిండియా సూపర్ స్టార్ గా విఖ్యాతి గాంచిన అమితాబ్ జనరేషన్ మారిపొయి ఖాన్ ల త్రయం హవా వచ్చాక షారుక్, అమిర్ ఖాన్ లు హీరోలు గా చేసిన చిత్రాలలో కేరక్టర్ లు చేసారు. అయినా అమితాబ్ అమితాబే అయిన స్థాయి ఎవరూ చేరలేనిది. విజయ్ ,అజిత్ ల హవా తమిళనాడు లో పెరిగిన తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రభ అక్కడ బాగా తగ్గిపోయింది.
గత 15 సంవత్సరాలలో రజనీవి ఒక్క జైలర్ తప్ప మరేచిత్రమూ సరిగ్గా ఆడలేదు ఎక్కువ శాతం సినిమాలు డిజాస్టర్స్. వీళ్ళందరికీ అతీతంగా తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో మెగాస్టార్ చిరంజీవి చరిత్రను తిరగరాస్తున్నారు. అమితాబ్,రజనీ లాంటి వారు నిరంతరాయంగా సినిమాల్లో కొనసాగుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల పదేళ్ళు గ్యాప్ వచ్చింది.పదేళ్ళు గ్యాప్ తో తిరిగి వచ్చిన తర్వాత ఆయన సృష్టిస్తున్న రికార్డులు నేటి స్టార్ హీరోలకు కూడా అందని విధంగా ఉంటున్నాయి. రీ ఎంట్రీలో ఆయన ఇప్పటివరకూ ఏడు చిత్రాలు చేసారు. అందులో నాలుగు చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ వసులుచేసాయి. మూడు చిత్రాలు 140 కోట్లు పైగా షేర్ సాధించాయి.కేవలం ఆచార్య, భోళాశంకర్ చిత్రాలు మాత్రమే ఫ్లాప్ అయ్యయి. గాడ్ ఫాదర్ మూవీ మంచి మూవీ గా పేరు వచ్చినా భారీవర్షాల కారణంగా 100 కోట్లు షేర్ సాధించలేకపోయింది. ఖైధి నెంబర్ 150, సైరా నరసిం హారెడ్డి, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ సాధించి గ్రాస్ కాదు షేర్ సాధించి తిరుగులేని రికార్డును మెగాస్టార్ కు కట్టబెట్టయి.నేటి స్టార్ హీరోలలో ఒక్క ప్రభాస్ కి తప్ప ఎవరికీ 100 కొట్లు షేర్ సాధించిన చిత్రాలు నాలుగు లేవు. రాజమౌళి తో చేసిన రెండు చిత్రాలు పక్కనపెడితే ప్రభాస్ కీ నాలుగు లేవు Next జనరేషన్ స్టార్ హీరోల హావా సాగుతున్నా కూడా తన ప్రభంజనాన్ని కొనసాగించగలగటం ఇండియా మొత్తం మిద కేవలం ఒక్క మెగాస్టార్ కే చెల్లింది.



