2023 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మెగా బ్లాక్ బస్టర్ అయ్యాకా…2024 సంవత్సరం లో మెగా ఫ్యామీలీ కి పొలిటికల్ సక్సెస్ దక్కినా సినిమాల విజయంలో వెనుక పడ్డారు, మళ్లీ 2025 సెకండ్ ఆఫ్ లో మొదలైన మెగాసౌండ్…2026 లో మోతెక్కిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.2024 లో జనసేన పార్టి పోటీ చెసిన అన్ని స్థానాలలో ఘనవిజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ ప్రమాణ స్వీకార వేదిక పై ఒక పక్క మెగాస్టార్ మరో పక్క పవర్ స్టార్ ల తో దేశం గర్వించతగ్గ ప్రధాని నరేంద్ర మోదీ దిగిన పిక్ 2024 సంవత్సరానికే పిక్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పవచ్చు, అదే 2024 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి ని పద్మ విభూషుడ్ని చేసింది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం మెగాస్టార్ ని వరించింది, కానీ సినిమా విజయాల పరంగా 2024 మెగా ఫ్యామీలీ వెనుక పడింది మెగాస్టార్ నుంచి కానీ పవర్ స్టార్ నుంచి కానీ గ్లోబల్ స్టార్ నుంచి కానీ ఒక్క సినిమా కూడా రాలేదు. కేవలం వరుణ్ తేజ్ నుంచే ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రాలు రీలీజయ్యాయి. అవి మంచి చిత్రాలుగా పేరువచ్చినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు, 2025 జనవరి లో భారీ అంచనాల మధ్య వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. రెండు సంవత్సరాలకు పైగా నిర్మాణం లో ఉన్న ఈ చిత్రాన్ని డైరక్టర్ శంకర్ పేలవంగా తెరకెక్కించారు ఇండియా లోనే బిగ్గెస్ట్ మాస్ హీరో తన చేతిలో ఉన్నా సరిగ్గా వినియోగించుకోలేక శంకర్ తన ఫ్లాప్ ల పరంపర కొనసాగించారు. ఐదేళ్లు నిర్మాణంలో ఉండిపోయి రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా నిరాశాపరచటం తో మెగా ఫ్యాన్స్ బాగా డీలాపడ్డారు..,ఇలాంటి నిరాశాజనకమైన పరిస్థితులను పవర్ స్టార్ నుంచి వెంటనే వచ్చిన OG ఒక్కసారిగా మార్చివేసింది. పవన్ రీ ఎంట్రీ తర్వాత మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా నిలిచిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. సూపర్ హిట్ టాక్ రావటం తో అదే ఊపును రెండు వారాల పాటు కొనసాగించింది OG.ఆంధ్రా, తెలంగాణా తో పాటు కర్నాటక,ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. 320 కోట్లు కు పైగా గ్రాస్ సాధించి 2025 టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. మెగా ఫ్యామిలీ ని ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన మూవీ గా OG ని చెప్పుకోవాలి.
బాబాయ్ స్టార్ చేసిన ఈ సక్సెస్ స్ట్రీక్ ని అబ్బాయి పీక్స్ కి తీసుకుపోయారు. నవంబర్ 7 న రిలీజైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమా యే రిలీజై బ్లాక్ బస్టర్ అయినంత రేంజ్ సంబరాలను పెద్ది సాంగ్ మెగా ఫ్యాన్స్ కు తీసుకువచ్చిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కేవలం టాలీవుడ్ లో కాదు..ఇండియా లో మాత్రమే కాదు…వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది పెద్ది సాంగ్. గ్లోబల్ వైడ్ గా టాప్ 2 ప్లేస్ లో నిలిచిందంటే అది ఏ రేంజ్ సక్సెస్ అనేది అర్ధం అవుతుంది.చిన్నా,పెద్దా,ఆడా,మగా, ఆడా,ఈడా తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చికిరి చికిరి సాంగ్ కి చరణ్ వేసిన స్టెప్ లను రీక్రియేట్ చేస్తూ రీల్స్ చేయటం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.గత కొన్నేళ్ళలో ఇంత సంచలనం సృష్టించిన సాంగ్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.ఈ బాబాయ్- అబ్బాయ్ ల మద్య మెగా ఫ్యామిలీ సృష్టికర్త మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళ వయసులో మీసాల పిల్ల అంటూ వచ్చి తనస్టైల్లో అదరకొట్టారు. తనయుడు వచ్చి డామినేట్ చేసాడు కానీ పెద్ది సాంగ్ వచ్చేవరకూ సోషల్ మీడియా హడావుడి అంతా మీసాల పిల్లదే,పెద్ది సాంగ్ వచ్చే వరకూ మీసాల పిల్ల రీల్సే హల్ చల్ చేసాయి కేవలం నెల రోజుల్లో ఓన్లీ టాలివూడ్ లోనే 50 మిలియన్ ల వ్యూస్ తో సంచలనం సృష్టించింది. పాటలకే ఈ రేంజ్ హడావిడి ఉందంటే….సంక్రాంతి కి వచ్చే మన శంకర్ వరప్రసాద్ గారు…ఉగాది కి వచ్చే పెద్ది..పాజిటివ్ టాక్ వస్తే బాక్సులు బద్దలు కావటం ఖాయం.ఇవి ఇలా ఉడంగా పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి.. మెగాస్టార్ విశ్వంభర తో ఇంకోసారి సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.వీటి రిలీజ్ డేట్ లు ఇంకా ఖరారు కావలసి ఉంది.



