Saturday, April 18, 2026
Google search engine
HomeMoviesరాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.. ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌కు మెగాస్టార్ చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొందరు తనపై ఆకారణంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ నాయకుడు తనపై విమర్శలు చేస్తే ఆ ప్రాంతానికే చెందిన మహిళ ఎదురు తిరిగిందన్నారు. ఆ వీడియో చూసి సదరు మహిళ గురించి వాకబు చేస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆవిడ బిడ్డ ప్రాణం నిలబడిందని తెలిసిందన్నారు. ఎప్పుడైనా మనం చేసే పనులే మాట్లాడుతుంటాయంటూ చిరంజీవి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular