పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే రికార్డులు. అందుకు ఆయన సినిమాలే సాక్ష్యం. మువీ హిట్, ప్లాఫ్ తో సంబంధం లేకుండా ఆయన కలెక్షన్స్ ఉంటాయి. అయితే ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నా త్వరలో రిలీజ్ కానున్న ఓజీ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మూవీ నుంచి ఒక్కో అప్డేట్ వస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుతతో ఉన్నారు. ఇటీవల రిలీజైన ఫైర్ స్ట్రోమ్ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విషయంలో ఆయన వరల్డ్ రికార్డ్ సాధించారంటూ నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అత్యధిక కాలం టాప్ ప్లేస్ లో కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా వరుసగా సినిమాలు చేయలేకపోతున్నారు. అయితే ఓజీ చిత్రంతో ఆయన తిరిగి ఫామ్ లోకి వస్తారని అటు ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని ఆశిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ నటించిన మొదటి 7 సినిమాలు ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చిన విషయం తెలిసిందే.



