దొమ్మర కులం పేరు ను మార్పు చేస్తూ విడుదల చేసిన జివో ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.దొమ్మర కులం పక్కన దొమ్మర (గిరిబలిజ) అని చేర్చి గతంలో విడుదల చేసిన జీవోను రద్దు చేసింది.. ఇటీవల శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి సభ్యులు వంక రవీంద్ర ఈ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.దొమ్మర కులస్థులు తమ కులం పేరు కించపరిచేలా ఉందని మార్పు చేయాలని చేసిన విజ్ఞప్తి పై ప్రభుత్వం వారి కులం పేరును దొమ్మర (గిరి బలిజ) గా మార్పు చేసిందని ఇది సమంజసం గా లేదని వంక ప్రస్తావించారు.కాపు కులస్తులకు చెందిన బలిజ పదాన్ని దొమ్మర కులం పక్కన చేర్చటం పట్ల కాపు కులస్తులను అవమానించినట్లు భావిస్తున్నారు అని వేరే పదం ఉపయోగించ వచ్చని ఈ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.. దీనికి స్పందన గా తాజా గా రాష్ర్ట ప్రభుత్వం తాజాగా పాత జిఓను రద్దు చేస్తూ దొమ్మర గిరిబలిజ అని కాకుండా కేవలం దొమ్మర గానే పేర్కొంటూ తాజా జివో రిలీజ్ చేసింది.ఈ సందర్భంగా కాపుల మనోభావాలకు సంబంధించిన సమస్యను శాసనమండలి లో ప్రస్తావించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంఎల్ సి వంక రవీంద్ర ను పలువురు అభినందించారు.



