గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ పెద్ది.జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది చిత్రాన్ని 2026 మార్చి 27 న రిలీజ్ చేయనున్నట్లు ఈ ఏడాది చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి అయిందని ఇంకా ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి కానందున రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో రూమర్స్ సృష్టించారు.. దీనిపై చిత్ర సంబంధీకులు మెగాపవర్ కి స్పష్టతనిచ్చారు.. ముందు అనుకున్నట్లు గానే 2026 మార్చి 27 న పెద్ది రిలీజ్ అవుతుంది అని ఎలాంటి డిలే లేదని చెప్పారు.చరణ్ బర్త్ డే కి రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్సెస్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎఆర్ రెహమాన్ లాంటి దిగ్గజం పెద్ది సినిమా పై స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేయటం సినిమా గురించి గొప్పగా మాట్లాడటం పెద్ది స్థాయిని తెలియచేస్తుంది
అనుకున్న డేట్ కే పెద్ది రిలీజ్
RELATED ARTICLES



