Saturday, April 18, 2026
Google search engine
Homeentertainmentదార్శనికుడు ఆరిమిల్లి

దార్శనికుడు ఆరిమిల్లి

తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధం లో పరుగులు పెట్టిస్తున్నారు.. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అవసరం అయితే అసెంబ్లీ లో కూడా గళం ఎత్తుతానని ఇటీవలే నిరూపించారు.ఉండ్రాజవరం జంక్షన్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు నత్త నడకన జరగటం పై అసెంబ్లీలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.తణుకు రాష్ట్రపతి రోడ్డు లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది.దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.తణుకు పట్టణం మొత్తానికి ఒకటే ప్రధాన రహదారి కావటం అసలు సమస్య.ఇది గమనించిన ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు పై దృష్టి సారించారు.ఇందులో భాగం గా కెనాల్ రోడ్డు ను కొత్తగా ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు.సుబ్రమణ్య స్వామి గుడి వంతెన వద్ద నుంచి సజ్జాపురం శివాలయం వంతెన వద్ద కి చేరుకునేలా కెనాల్ రోడ్డు ను ఏర్పాటు చేస్తున్నారు.పట్టణం వైపు కాకుండా కాలువ అవతలి వైపు నిర్మిస్తున్న ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే నరేంద్ర సెంటర్ నుంచి రాష్ట్రపతి రోడ్డు తో సంబంధం లేకుండా ఈ కెనాల్ రోడ్డు ద్వారా హౌసింగ్ బోర్డు కాలనీ, సజ్జాపురం, ఇంకా జాతీయ రహదారి కి చేరుకోవచ్చు.దీనివల్ల రాష్ట్రపతి రోడ్డు పై కొంత వత్తిడి తగ్గుతుంది.ఇప్పటి వరకూ ఎవరూ దృష్టి సారించని ఈ కెనాల్ రోడ్డు ని గుర్తించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆరిమిల్లి రాధాకృష్ణ కృషి చేయటం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular