మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మెషిన్ గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 14 న రిలీజ్ అయింది.ఈ సాంగ్ కి ఆడియెన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మీసాల పిల్ల అంటూ సాగే ఈ సాంగ్ కి కేవలం ప్రోమో కే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి వేల కొద్దీ రీల్స్ సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయిన విషయం తెలిసిందే.ఇపుడు ఫుల్ సాంగ్ కి అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.భార్యాభర్తల తగాదా నేపధ్యం లో ఈ సాంగ్ రూపొందించటం విశేషం.దీంతో ఈ సాంగ్ కి విపరీతమైన రీచ్ ఉంటుంది.డాన్స్, మ్యూజిక్, లిరిక్స్ సమిష్టిగా రాణించటం ఈ సాంగ్ లో చూడవచ్చు.మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళ వయసులో అధ్బుతమైన గ్రేస్ తో స్టెప్స్ వేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఈ సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ రాబోయే సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని మీసం మెలేస్తున్నారు.రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య చిత్రాలు రెండూ బ్లాక్ బస్టర్ లు గా నిలిచిన విషయం తెలిసిందే
మీసాల పిల్ల.. ఫ్యాన్స్ మీసం మెలేస్తారు
RELATED ARTICLES



