మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే దానికి పడి ఏడ్చే వాళ్ళు కొందరు ఎప్పటి నుంచో ఉన్నారు.వాళ్ళ ఏడుపు కి తగ్గట్లుగా మెగాస్టార్ కూడా అలాంటి వారిని నాలుగు దశాబ్దాలుగా ఏడిపిస్తూనే ఉన్నారు.ఆయన ఎన్టీఆర్ ఎఎన్ఆర్ తరం నుంచీ తరతరాల వారితో పోటీ పడుతూ తన డామినేషన్ చూపిస్తూనే ఉన్నారు.ఆయన జనరేషన్ హీరోలు ఇప్పుడు వెటరన్ లు గా మారిపోయారు.ప్రస్తుత టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల కి పోటీ ఇవ్వటం కాదు కదా వాళ్ళ సినిమా కలెక్షన్స్ లో సగం రాబట్ట గలిగినా గొప్పే అన్నట్లు గా ఉంది అప్పటి జనరేషన్ టాప్ స్టార్ ల పరిస్థితి.కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటి యంగ్ స్టార్ హీరోలకు ఇప్పటికీ ధీటైన పోటీ ఇవ్వగలుగుతున్నారు.వందకోట్లు పైగా షేర్ సాధించిన చిత్రాలు మెగాస్టార్ కి మూడు ఉన్నాయి.రీ ఎంట్రీ లో ఇప్పటి వరకూ ఆరు చిత్రాలు చేస్తే అందులో రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్ (నాన్ బిబి). ఈ జనరేషన్ స్టార్ లకే రాజమౌళి తో కాకుండా రెండు ఇండస్ట్రీ హిట్ లు గత ఎనిమిది సంవత్సరాల్లో లేవు.ఇపుడు సంక్రాంతి కి రానున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ కూడా వందకోట్లు షేర్ సాధించటం పక్కా.. అంటే మెగాస్టార్ కి వంద కోట్లు షేర్ సాధించిన చిత్రాలు నాలుగు అవుతాయి..ప్రెజెంట్ టాప్ స్టార్ ల లో ఒక్క ప్రభాస్ తప్ప వంద కోట్లు షేర్ సాధించిన నాలుగు చిత్రాలు ఎవరికీ లేవు.రాజమౌళిని పక్కన పెడితే ప్రభాస్ కీ లేవు.మరి ఇంత రేంజ్ లో డామినేషన్ చూపిస్తుంటే అపోజిషన్స్ మెగాస్టార్ ని చూసి ఏడవటం సహజమే కదా.. ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ బ్లాక్ బస్టర్ కావటం తో వాళ్ళ ఏడుపు మరోసారి మొదలై పోయింది.మెగాస్టార్ తో అలా స్టెప్స్ వేయించటం ఏంటి?.. యూత్ ఆడియెన్స్ కి సాంగ్ నచ్చలేదు.. ఇలా ఉంది వాళ్ళ ఏడుపు.యూత్ ఆడియెన్స్ కి నచ్చకుండానే వేల కొద్దీ రీల్స్ వచ్చేసాయా ఆ పాట పై.. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంభినేషన్ అనగానే ఏర్పడిన అంచనాలు మీసాల పిల్ల సాంగ్ తో భారీ గా పెరిగిపోయాయి.మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించటం తో పాటు ష్యూర్ షాట్ హిట్ అనే కాన్ఫిడెన్స్ ట్రేడ్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది



