గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రూపొందుతున్న పెద్ది చిత్రం ఫస్ట్ గ్లింప్సెస్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఐపిఎల్ సీజన్ లో రిలీజైన ఈ గ్లింప్సెస్ లోని క్రికెట్ షాట్ ని ఐపిఎల్ టీం లు కూడా రీ క్రియేట్ చేసాయంటే అది ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.. ఇపుడు పెద్ది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కి టైం వచ్చింది.నవంబర్ 7 న రిలీజ్ అయిన ఈ ఫస్ట్ సింగిల్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఇది రిలీజ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.10 గంటలు కూడా గడవక ముందే పది మిలియన్ లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది..చరణ్ వేసిన సిగ్నేచర్ స్టెప్ తో వేల కొద్దీ రీల్స్ రెడీ అయిపోవటం ఆశ్చర్యం గా ఉంది.. ఆఫ్ కోర్స్ ఆ స్టెప్స్ లో చరణ్ ఆ రేంజ్ గ్రేస్ చూపించారు.గ్లింప్స్ తో ఓ రేంజ్ కి చేరిన అంచనాలు ఇప్పుడు ఈ చికిరి..చికిరి..సాంగ్ తో ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి… ఫస్ట్ గ్లింప్సెస్ కి మించి ఈ సాంగ్ సంచలనం సృష్టించటం ఖాయం.. రిలీజ్ అయిన ఫస్ట్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ గా ఈ చికిరి సాంగ్ తిరుగులేని రికార్డు సృష్టించటం ఖాయం..మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా 2026 మార్చి 27 న రిలీజ్ కానున్న పెద్ది చిత్రం ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది
చికిరి సాంగ్ అదిరిపోయింది…
RELATED ARTICLES



