మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘మెగా 157’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ రానుంది. ఆగస్టు 22న ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చిరు మార్క్ యాక్షన్, అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ కలయికతో ఈ సినిమా ఉండనుంది.
ఆగస్టు 22.. మెగా అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే అది మెగాస్టార్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చిరు బర్త్ డే మంత్ అంటూ కామన్ డీపీతో నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు ఆయన నటించే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ అప్డేట్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మెగా 157’ నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని ‘మెగా 157’, ‘చిరు అనిల్’, ‘చిరు 157’ వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్నారు. ఉగాదికి సెట్స్ మీదకు వచ్చిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు షూటింగుకు సంబంధించిన విషయాలను అనిల్ వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగా.. తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
సవాల్ విసిరిన అనిల్ రావిపూడి.. ఆగస్టు 22న చూసుకుందాం!
RELATED ARTICLES



