సినీ నటుడు మోహన్ బాబు కి చెందిన మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమం గా 26కోట్ల రూపాయల కి పైగా వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.మోహన్ బాబు యూనివర్సిటీ పై విచారణ జరిపిన ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీ కి 15 లక్షలు జరిమానా విధించటంతో పాటు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని సూచించింది.. కాగా ఉన్నత విద్యా మండలి ఆదేశాల పై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు స్టే విధించింది.
డే స్కాలర్స్ నుంచి మెస్ ఛార్జీలు
మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమం గా వసూళ్లు చేసిన విధానం చూస్తే ఎవరికైనా వారంటే అసహ్యం వేస్తుంది.ఎక్కడైనా హాస్టల్ విద్యార్థుల నుంచి మెస్ ఛార్జీలు వసూలు చేస్తారు.కానీ మోహన్ బాబు యూనివర్సిటీ డే స్కాలర్స్ (ఇంటి నుంచి వచ్చే విద్యార్థులు) నుంచి మెస్ ఛార్జీలు వసూలు చేయటం దారుణమైన దోపిడీ



