Saturday, April 18, 2026
Google search engine
Homeentertainmentఅబ్బురపరిచేలా ఉంటుంది ఆ చిత్రం:అట్లీ

అబ్బురపరిచేలా ఉంటుంది ఆ చిత్రం:అట్లీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తాను రూపొందిస్తున్న చిత్రం ఎఎ22 ప్రేక్షకులను అబ్బుర పరిచే విధంగా ఉంటుంది అని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ చెప్పారు.తాజాగా బెంగళూరు లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తమ కొత్త చిత్రం గురించి ప్రస్తావించారు.అల్లు అర్జున్ తో తాను తీస్తున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది అని చెప్పారు.ఈ ప్రపంచాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అని అన్నారు.ఏదైనా ఒక్క ఆలోచన తోనే మొదలవుతుంది అన్నారు.తమ ప్రయాణం లో దేవుడు తోడు ఉన్నాడని అన్నారు.ఈ భారీ ప్రాజెక్ట్ ను రిస్క్ గా తాను భావించడం లేదని చెప్పారు.. ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేస్తున్నానని కొద్ది నెలల తర్వాత ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పారు.ఇటీవల విడుదల అయిన కాంతార చాప్టర్ 1 గురించి మాట్లాడుతూ అది ఒక అధ్బత చిత్రం అని ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular