Saturday, April 18, 2026
Google search engine
Homeentertainmentమెగా అభిమానుల సర్వ సైన్యాధ్యక్షుడు కి జన్మదిన శుభాకాంక్షలు

మెగా అభిమానుల సర్వ సైన్యాధ్యక్షుడు కి జన్మదిన శుభాకాంక్షలు

మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు ఈరోజు.మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు వారి స్టార్ డమ్ కారణంగా అభిమానులకు అందుబాటులో ఉండటం అన్ని వేళలా సాధ్యం కాదు.కానీ ఆ లోటు తెలియనీయకుండా అభిమానుల పై ఆత్మీయత ను చూపిస్తూ వారికి అండగా నిలిచే వ్యక్తి గా మెగా బ్రదర్ నాగబాబు కి అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.రెండు తెలుగు రాష్ర్టాలలో ఉన్న మెగా ఫ్యాన్స్ నాయకులను ప్రతీ ప్రాంతం నుంచీ కూడా వ్యక్తి గతం గా గుర్తించి పలకరించే పరిచయాలు ఉండటం నాగబాబు గారి స్పెషాలిటీ.అటు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో కానీ ఇప్పుడు జనసేనలో కానీ పార్టీ పటిష్టతకు కృషి చేసిన అతి కొద్ది మంది లో నాగబాబు ముఖ్యులు.ఆయన సేవలు కి గుర్తింపు గా జనసేనాని పవన్ కళ్యాణ్ సూచన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం లోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు..ఈ క్రమంలో నాగబాబు ఇటీవలే శాసనమండలి సభ్యులు గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.త్వరలోనే ఆయన మంత్రి పదవి చేపట్టబోతున్నారు.సహజంగా నాగబాబు పదవులు కోరుకునే వ్యక్తి కాదు.ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గురించి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అభిమానుల గురించే ఉంటాయి.ఆయన మంత్రి పదవి చేపట్టినా అది ప్రజల కోసం జనసైనికుల శ్రేయస్సు కోసం మరింత గా కృషి చేయడానికే ఉపయోగ పడుతుంది. మెగాభిమానుల సర్వ సైన్యాధ్యక్షుడు గా మెగా ఫ్యాన్స్ పిలుచుకునే నాగబాబు గారి కి మెగా పవర్ తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🌹🌹🌹

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular