చేతిలో బ్రహ్మాస్త్రం ఉంటే సరిపోదు.దానిని ప్రయోగించగల నేర్పు ఉండాలి.మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి తన చిత్రం లో హీరో గా ఉంటే ఆయన లోని టాలెంట్ ను పూర్తి స్థాయిలో ఎలా సద్వినియోగం చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో హిట్ మెషిన్ గా పేరు పొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి నిరూపించారు.మెగాస్టార్ తో అనిల్ తీసిన మన శంకర వరప్రసాద్ గారు ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో ఇపుడు చూస్తున్నాం.ఈ చిత్రం రీజనల్ మూవీస్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవటం ఇక లాంఛనమే.కొత్త కధ.. కొత్త జోనర్.. ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లలేదు అనిల్ రావిపూడి. సింపుల్ కథలో మెగాస్టార్ చిరంజీవి ని ఆడియన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించారు.అలా అని ఏదో కామెడీ సినిమా గా మాత్రమే తీయలేదు.నాన్న అంటే నీలా ఉండాలి అని కూతురే తను ఎవరో తెలియకుండా చెపుతుంటే కదిలిపోయే నాన్నను చూపించారు.అత్తా కోడళ్ళ మద్య అధ్బుతమైన డైలాగ్స్ తో కూడిన సీన్ తో సినిమా స్థాయిని ఒక్కసారి గా పైకి లేపారు.ఒక్కమాటలో చెప్పాలంటే మెగా టాలెంట్ ని ఎలా వినియోగించుకుంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చో అవపోసన పట్టిన వాడు అనిల్ రావిపూడి
బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలిసిన వాడు రావిపూడి
RELATED ARTICLES



