Saturday, April 18, 2026
Google search engine
Homeentertainmentపెద్ది అంటే హడలిపోతున్నారా!

పెద్ది అంటే హడలిపోతున్నారా!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ఏప్రిల్ 30 న రిలీజ్ కానుంది.ముందుగా మార్చి 27 న రిలీజ్ అని ప్రకటించిన పెద్ది మూవీ ఐదు వారాలు వాయిదా పడింది.అయితే పెద్ది సినిమా ఏప్రిల్ 30 నుంచి కూడా వాయిదా పడనుందని కొందరు వార్తలు సృష్టిస్తున్నారు.రాజమౌళి తీసిన RRR చిత్రం తో రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.RRR తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ మూవీ లో చరణ్ ఇమేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ శంకర్ ఘోరం గా విఫలమయ్యారు.అంత మాస్ ఇమేజ్ ఉన్న చరణ్ కి ఇచ్చిన రెండు కేరక్టర్ లూ కూడా పాసివ్ మోడ్ లో డిజైన్ చేయడం విస్మయం కలిగించింది.అంత అనుభవం ఉన్న శంకర్ చరణ్ ఇమేజ్ ను సద్వినియోగం చేసుకోలేకపోతే కేవలం ఒక్క చిత్రం అనుభవం ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం పెద్ది ని చరణ్ ఇమేజ్ ను మరింత ఎలివేట్ అయ్యేలా తీస్తున్నారని ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ను బట్టి తెలిసిపోతుంది.రంగస్థలం తోనే చరణ్ ఇమేజ్ next level కి చేరింది.వినయ విధేయ రామ హిట్ అయి ఉంటే ఆ విషయం అందరికీ అర్థం అయి ఉండేది.ఆ తర్వాత వచ్చిన RRR క్రెడిట్ ని రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పంచుకోవాల్సి వచ్చింది చరణ్.అందువల్ల చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది బయటపడలేదు.రంగస్థలం RRR ల తర్వాత చరణ్ కి హిట్ పడక చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కి చేరిందీ అనేది స్పష్టత రావడం లేదు.తిరుగులేని రేంజ్ కు చేరింది ట్రేడ్ అనలిస్ట్ లకు అర్థం అవుతుంది.
అయితే అది అందరికీ అర్థం కావాలంటే ఒక సాలిడ్ హిట్ పడాలి.అది పెద్ది తో సాధ్యం అని అందరికీ అర్థం అవుతుంది.అందుకే అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తుంటే అపోజిషన్స్ పెద్ది వాయిదా పడిపోవాలని కోరుకుంటున్నారు.ఎందుకంటే ఒక్కసారి పెద్ది రిలీజ్ అయితే ఇంక అపోజిషన్స్ కి మాట్లాడటానికి ఏమీ మిగలదు.రంగస్థలం RRR ల తర్వాత చరణ్ రేంజ్ ఏ స్థాయి కి చేరింది అనేది అందరికీ తెలిసిపోతుంది.అందుకే సిల్లీ కారణాలు చూపించి పెద్ది సినిమా మళ్ళీ వాయిదా పడుతుంది అనేలా వార్తలు రాస్తున్నారు.రామాయణం మూవీ కి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు కాబట్టి ఆ వర్క్ లోడ్ వల్ల పెద్ది కి అనుకున్న టైం కి రీ రికార్డింగ్ కంప్లీట్ చేయగలరా లేదా అని డౌట్ అట..ఏదీ ఈ ఏడాది నవంబర్ లో వచ్చే రామాయణం మూవీ కి.పెద్ది క్లైమాక్స్ అధ్బుతంగా వచ్చింది అని రాసిన పెద్ద మనిషే ఏప్రిల్ 30 కి వర్క్ టైట్ అవుద్ది అంటాడు. క్లైమాక్స్ పూర్తి అయిపోయి మేజర్ వర్క్ పూర్తి అయిపోయిన సినిమా కి రిలీజ్ డేట్ ఇంకా రెండు నెలలు పైగా ఉండగా వర్క్ టైట్ అవటం ఏంటో!. అసలు లాజిక్ ఆలోచిస్తున్నారా వీళ్ళు.సినిమాని మార్చి 27 నుంచి ఇంకో డేట్ కి మారుస్తున్నారు.అలాంటపుడు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారు.. తమకు అనుకూలంగా ఉన్న డేట్ ప్రకటిస్తారు తప్ప హడావిడిగా డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ ఆ డేట్ నుంచి ఇంకో డేట్ కి పోస్ట్ పోన్ చేసుకునేలా ఎందుకు చేసుకుంటారు.నిర్మాతలకు ఆ మాత్రం తెలియదా.తమ సినిమా పొజిషన్ ఏంటి.. ఎప్పటికి ఫినిష్ అవుతుంది అని.. ఇలాంటి వార్తలు రాసే వాళ్ళంతా మెగా హేటర్శ్.వీళ్ళంతా ఏప్రిల్ 30 న పెద్ది సృష్టించే సునామీ లో కొట్టుకుపోతారు..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular